Andhra Pradesh: కోస్తాలో వణుకుతున్న జనం.. చింతపల్లిలో 4.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- మధ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులు
- ఉదయం 9 గంటలు అవుతున్నా కనిపించని సూర్యుడి జాడ
- దారుణంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటలు అవుతున్నా సూర్యుడి జాడ లేకపోవడంతో జనం చలికి వణుకుతున్నారు. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంంగా కోస్తాలో చలితీవ్రత పెరిగింది.
అలాగే, ఒడిశాను ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, తెలంగాణను ఆనుకుని ఉన్న మధ్య కోస్తా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. చింతపల్లిలో అత్యంత కనిష్ఠంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో ఇక్కడ నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.