Earthquake: అండర్-19 ప్రపంచకప్: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. వీడియో ఇదిగో!

Earthquake zolts in trinidad as U19 World Cup match is live

  • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ సముద్ర తీరంలో భూ ప్రకంపనలు
  • మ్యాచ్ జరుగుతున్న క్వీన్స్ పార్క్ ఓవల్‌లోనూ కంపించిన భూమి
  • గుర్తించని ఆటగాళ్లు.. కొనసాగిన ఆట
  • వణికిపోయిన కెమెరాలు

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వే-ఐర్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. మ్యాచ్‌ను షూట్ చేస్తున్న కెమెరాలు ఒక్కసారిగా వణికాయి. కామెంటరీ బాక్స్ కూడా కుదుపులకు గురైంది. అయితే, ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తమ కాళ్ల కిందనున్న భూమి కంపించిన విషయం ఆటగాళ్లకు తెలియకపోవడం గమనార్హం. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ కొనసాగింది. జింబాబ్వే ఆరో ఓవర్ నడుస్తున్న సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. 20 సెకన్లపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది.

పోర్టు ఆఫ్ స్పెయిన్ సముద్ర తీరంలో ఈ భూకంపం సంభవించగా మ్యాచ్ జరుగుతున్న క్వీన్స్ పార్క్ ఓవల్‌లోనూ స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. కెమెరాల్లో రికార్డయినవి అవే. భూకంప సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆండ్రూ మాట్లాడుతూ.. తమ వెనక రైళ్లు పరిగెడుతున్న దానికంటే ఎక్కువ ప్రకంపనలే వచ్చాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News