Nirmala Sitharaman: పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman introduced financial survey in Parliament

  • 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి
  • ఆర్థిక వృద్ధి రేటును 8 నుంచి 8.5 శాతంగా అంచనా వేసిన సర్వే
  • సేవల రంగంలో 8.2 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా  

పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2022-23లో 8 నుంచి 8.5 శాతం ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.2 శాతంగా నమోదవ్వొచ్చని సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు నాటి స్థితికి చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. సేవల రంగంలో 8.2 శాతం, వినియోగంలో 7 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక సర్వే ఆధారంగానే ప్రతి ఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి, సూచనలు చేస్తుంది.

  • Loading...

More Telugu News