Sridhar Krishna Reddy: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కన్నుమూత

TDP leader and former MLA Sridhar Krishna Reddy died
  • కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కృష్ణారెడ్డి
  • ఇవాళ తన నివాసంలో తుదిశ్వాస విడిచిన వైనం
  • గతంలో అనిల్ కుమార్ ను ఓడించిన నేత
  • శ్రీధర కృష్ణారెడ్డి మృతిపై సోమిరెడ్డి దిగ్భ్రాంతి
టీడీపీ నేత, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇవాళ నెల్లూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఆయన గతంలో నెల్లూరు జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ గానూ, నెల్లూరు సిటీ తెలుగు యువత ప్రెసిడెంట్ గానూ వ్యవహరించారు. కాగా, శ్రీధర కృష్ణారెడ్డి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై స్వల్ప తేడా విజయం దక్కించుకున్నారు.

శ్రీధర కృష్ణారెడ్డి మృతిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తాము ఆయనను శ్రీధరన్నగా పిలుచుకుంటామని, ఆయన హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. శ్రీధర కృష్ణారెడ్డి తనకు అత్యంత ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు అని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Sridhar Krishna Reddy
Demise
Cancer
TDP
Nellore City

More Telugu News