Bheemla Naik: ఈ రెండు తేదీల్లో ఎప్పుడైనా వస్తాం: 'భీమ్లా నాయక్' చిత్రబృందం ప్రకటన

 Bheemla Naik unit announces two release dates
  • వరుసగా పెద్ద సినిమాల విడుదల
  • ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ రిలీజ్
  • కుదరకపోతే ఏప్రిల్ 1న వస్తామని వెల్లడి
  • ఇప్పటికే రిలీజ్ డేట్లు ప్రకటించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య
పవన్ కల్యాణ్ హీరోగా, రానా ప్రతినాయక పాత్రలో నటించిన చిత్రం భీమ్లా నాయక్. వరుసగా పెద్ద సినిమాలు విడుదల తేదీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో, 'భీమ్లా నాయక్' చిత్రబృందం కూడా స్పందించింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగేందుకు ఎదురుచూస్తున్నామని, భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేస్తామన్న మాట నిలబెట్టుకుంటామని పేర్కొంది. పరిస్థితులు అనుకూలిస్తే 'భీమ్లా నాయక్' ను ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న తీసుకువస్తామని చిత్రబృందం వెల్లడించింది.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ (మార్చి 25), ఆచార్య (ఏప్రిల్ 29) తమ విడుదల తేదీలు ప్రకటించడం తెలిసిందే. ఈ వేసవిలో పెద్ద సినిమాలు వస్తుండడంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
Bheemla Naik
Release
Pawan Kalyan
Corona Pandemic
Tollywood

More Telugu News