Samajwadi Party: అఖిలేశ్ యాదవ్ ఆస్తులు రూ.40 కోట్లు.. ఏ రూపంలో ఎంతంటే..!

how much Samajwadi Party chief Akhilesh Yadav is worth as per his poll affidavit

  • బ్యాంకు ఖాతాల్లో రూ.8.43 కోట్ల నగదు 
  • వ్యవసాయేతర భూమి విలువ రూ.17.22 కోట్లు 
  • అఖిలేశ్ వార్షికాదాయం రూ.83.98 లక్షలు
  • డింపుల్ యాదవ్ ఆదాయం రూ.58.92 లక్షలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (48) అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఈ ప్రకారం చూస్తే అఖిలేశ్ వద్ద రూ.40.02 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

మెయిన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి అఖిలేశ్ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ను బీజేపీ పోటీలో దింపింది. అఖిలేశ్ యాదవ్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 8.43 కోట్ల నగదును వివిధ బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్ రూపంలో కలిగి ఉన్నారు. అలాగే, 17.93 ఎకరాల భూమి కూడా ఆయన పేరిట ఉంది. ఇది కొన్ని కోట్ల విలువ చేస్తుంది. అలాగే, ఆయనకున్న వ్యవసాయేతర భూమి విలువను రూ.17.22 కోట్లుగా ఆయన ప్రకటించారు.

బ్యాంకు రుణానికి సంబంధించి రూ.28.97 లక్షలు చెల్లించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అఖిలేశ్ యాదవ్ తనకు రూ.83.98 లక్షలు, భార్య డింపుల్ యాదవ్ రూ.58.92 లక్షల చొప్పున వార్షిక ఆదాయాన్ని కలిగి ఉన్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News