Rahul Gandhi: కేంద్ర వార్షిక బడ్జెట్ పై రాహుల్ గాంధీ స్పందన

Rahul Gandhi opines on union budget

  • పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మల
  • రూ.39.45 లక్షల కోట్లతో బడ్జెట్
  • వేతన జీవులకు మొండిచేయి చూపారన్న రాహుల్
  • బడుగు, బలహీన వర్గాలను కూడా విస్మరించారని వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.39.45 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ఆమె కొన్ని రంగాలను సంతృప్తి పరచలేకపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, వేతన జీవులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి ఊరట లేదు.

వ్యక్తిగత ఆదాయపన్నుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోగా, పన్నుశ్లాబుల్లోనూ మార్పు లేదు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేలుగానే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బడ్జెట్ పై స్పందించారు.

మోదీ సర్కారు 'జీరో' సమ్ బడ్జెట్ ప్రకటించిందని అంటూ విమర్శించారు. వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News