KCR: కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ స్పందన

KCR response on union budget

  • కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసింది
  • ఎలాంటి దిశానిర్దేశం లేకుండా బడ్జెట్ తయారు చేశారు
  • దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టడం లేదు

కేంద్ర బడ్జెట్ ఒక పనికిమాలిన, పసలేని బడ్జెట్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, రైతులకు, పేదలకు, సామాన్యులకు, కుల వృత్తుల వారికి, ఉద్యోగులను ఈ బడ్జెట్ నిరాశకు గురి చేసిందని చెప్పారు.

ఎలాంటి దిశానిర్దేశం లేకుండా బడ్జెట్ తయారు చేశారని విమర్శించారు. బడ్జెట్ చాలా గొప్పగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటోందని దుయ్యబట్టారు. మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ఇదని అన్నారు. రైతాంగానికి ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.  

పన్ను చెల్లింపుల విషయంలో స్లాబులను మార్చకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేశారని కేసీఆర్ అన్నారు. ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని చెప్పారు. ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యతను ఇవ్వలేదనే విషయం ఈ బడ్జెట్ ద్వారా నిరూపితమయిందని అన్నారు. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగాన్ని ప్రపంచమంతా అభివృద్ధి పరుస్తుంటే... కేంద్రానికి ఆ సోయి లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News