Amit Shah: బడ్జెట్‌లో కేంద్రమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్న శాఖకు రూ. 900 కోట్ల కేటాయింపు
- గతేడాది జులైలో సహకార శాఖ ఏర్పాటు
- సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
- ‘సహకార సంఘాల అభ్యున్నతి’ పథకానికి రూ. 274 కోట్లు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్న సహకార శాఖకు రూ. 900 కోట్లు కేటాయించారు. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో జులై 2021లో ఈ శాఖను ఏర్పాటు చేశారు. ఇప్పుడీ శాఖకు ఏకంగా రూ. 900 కోట్లు కేటాయించారు.
సహకార సంఘాలపై ప్రత్యామ్నాయ కనీస పన్ను (ఏఎంటీ) 15 శాతానికి, సర్‌చార్జ్ 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఏఎంటీ 18.5 శాతం, సర్‌చార్జ్ 12 శాతం ఉన్నాయి. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 900 కోట్ల నిధుల్లో రూ. 350 కోట్లను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) డిజిటలైజేషన్ కోసం ఖర్చు చేస్తారు. రూ. 274 కోట్లను ‘సహకార సంఘాల అభ్యున్నతి’ పథకం కోసం వెచ్చిస్తారు.