Varla Ramaiah: కొత్త రాజ్యాంగం కావాలంటాడేంటి ఆ ముఖ్యమంత్రి?: టీడీపీ నేత వర్ల రామయ్య
- అంటే, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అక్కర్లేదా?
- అవసరమైనప్పుడు రాజ్యాంగానికి మార్పులు
- ఆ అవకాశం ఉందని ఆ సీఎంకు తెలియదా?
- అంబేడ్కర్ ను అవమానించినట్లే
కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దేశానికి కొత్త రాజ్యాంగం కావాలంటూ చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తాజాగా, టీడీపీ ఏపీ నేత వర్ల రామయ్య కూడా ఈ విషయంపై స్పందిస్తూ కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా విమర్శించారు.
''కొత్త రాజ్యాంగం కావాలంటాడేంటి ఆ ముఖ్యమంత్రి. అంటే, డా.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అక్కర్లేదా? అవసరమైనప్పుడు రాజ్యాంగానికి మార్పులు చేసుకునే అవకాశం ఉందని ఆయనకు తెలియదా? ఈ మాత్రం తెలియకుండా, అసలు కొత్త రాజ్యాంగం కావాలంటే, అంబేడ్కర్ ను అవమానించినట్లే, అర్థం చేసుకోండని మనవి'' అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.