omicron: నాలుగు వారాల్లో కరోనా తగ్గుముఖం: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

omicron will come down in 4 weeks
  • దక్షిణాఫ్రికాలోనూ వేగంగా పెరిగి తగ్గాయి
  • ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నది బీఏ.2
  • ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో బయటపడడం లేదు
  • ఇతర అనారోగ్య సమస్యలుంటే కొంత తీవ్రత
కరోనా ఒమిక్రాన్ ఉద్ధృతి వచ్చే నాలుగు వారాల్లో తగ్గుముఖం పడుతుందని ప్రముఖ వైద్య నిపుణుడు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో చాలా వేగంగా కేసులు పెరిగి, అంతే వేగంగా తగ్గినట్టు ఆయన గుర్తు చేశారు. ఇక్కడ కూడా వచ్చే నాలుగు వారాల్లో కరోనా తీవ్రత తగ్గిపోతుందని చెప్పారు.

ప్రస్తుతం ఒమిక్రాన్ లో ఉపరకం బీఏ.2 వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ‘‘ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ఇది చిక్కడం లేదు. ఇప్పటి వరకు పరీక్షలో ఎస్ జీన్ కనిపించకపోతే ఒమిక్రాన్ గా గుర్తించడం సాధ్యపడేది. కానీ, బీఏ.2 రకం అలా కాదు. ఎస్ జీన్ గుర్తించిన వారిలోనూ వెలుగు చూస్తోంది’’ అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు.

ఒమిక్రాన్ తీవ్రత పెద్దగా ఉండడం లేదని చెప్పారు. కొద్ది మందిలో ముఖ్యంగా, దీర్ఘకాలిక వ్యాధి బాధితుల్లో ఒమిక్రాన్ తీవ్రత కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న 20 మంది వరకు ఒమిక్రాన్ తో తమ ఆస్పత్రిలోని ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. పిల్లల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోందన్నారు. ఒమిక్రాన్ తగ్గిపోయిన తర్వాత నీరసం, బలహీనతతో కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు.
omicron
come down
dr nageswar reddy
aig

More Telugu News