Kim Jong Un: మళ్లీ ఇన్నాళ్లకు బయటకొచ్చిన ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య!

Kim Jong Un Wife Ri Sol Ju Makes Public Appearance After 5 months
  • ఐదు నెలల పాటు ఇంట్లోనే
  • ఓ ఆర్ట్ ప్రదర్శనకు కిమ్ తో కలిసి తాజాగా హాజరు
  • వెల్లడించిన కొరియా అధికారిక పత్రిక
  • దంపతులకు ముగ్గురు పిల్లలున్నారన్న దక్షిణ కొరియా నిఘా విభాగం
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు చాన్నాళ్లకు బయటకు వచ్చారు. చివరిసారి గత ఏడాది సెప్టెంబర్ 9న బయటకు వచ్చిన ఆమె.. మళ్లీ ఐదు నెలల తర్వాత ఇప్పుడు అందరికీ కనిపించారు. లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ లోని మాన్సుడే ఆర్ట్ థియేటర్ లో నిర్వహించిన ఆర్ట్ ప్రదర్శనకు కిమ్ తో పాటు ఆమె హాజరయ్యారు.

దేశ అధికారిక పత్రిక కేసీఎన్ఏ ఈ మేరకు వెల్లడించింది. భార్య రి సోల్ జుతో కలిసి కిమ్ వస్తున్నప్పుడు ఆడిటోరియంలోని వారంతా చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారని పేర్కొంది. ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన కిమ్ దంపతులు.. ఆర్టిస్ట్ లతో ఫొటోలు దిగారని, వారికి శుభాకాంక్షలు చెప్పారని తెలిపింది.

వాస్తవానికి కిమ్ తన భార్యతో కలిసి బయటకు రావడం చాలా అరుదు. కానీ, కిమ్ తో పాటు రి సోల్ జు.. మిలటరీ కార్యక్రమాలు, సామాజిక, వ్యాపార కార్యక్రమాలకు హాజరై అంతర్జాతీయ సమాజం దృష్టిని తనవైపునకు తిప్పుకొన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ కన్సర్ట్ కు హాజరయ్యాక మళ్లీ ఆమె బయటకు రాలేదు. దీంతో ఆమె ఆరోగ్యం బాగాలేదని, గర్భవతి అని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే, సెప్టెంబర్ 9న ఓ వేడుకకు ఆమె రావడంతో ఆ వార్తలకు చెక్ పడినట్టయింది.

అయితే, కరోనా మహమ్మారి వల్ల ఆమె ఇన్నాళ్లూ బయటకు రాలేదని, తన పిల్లలతో కలిసి కాలాన్ని గడిపిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీసెస్  ఆ దేశ ప్రభుత్వానికి తెలియజేసింది. కిమ్, రి దంపతులకు ముగ్గురు పిల్లలున్నట్టు తన నివేదికలో పేర్కొంది.
Kim Jong Un
North Korea
Ri Sol Ju

More Telugu News