jobs: ప్రైవేటు సంస్థలలో స్థానికులకు 75% రిజర్వేషన్.. నిలిపివేసిన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు

High court stalls Haryanas reservation for locals in private jobs

  • ఈ నెల 15 నుంచే అమల్లోకి వచ్చిన చట్టం
  • హైకోర్టును ఆశ్రయించిన పరిశ్రమలు
  • రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని వాదన

ప్రైవేటులోనూ రిజర్వేషన్ల సంస్కృతిని ప్రవేశపెట్టిన హర్యానా రాష్ట్ర సర్కారుకు చుక్కెదురైంది. స్థానికులకు ప్రైవేటు సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది.

హర్యానా పౌరులకు ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ హర్యానా ఇండస్ట్రీస్ అసోసియేషన్ లోగడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టం రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, దీనికి యోగ్యత లేదని గురుగ్రామ్ ఇండస్డ్రియల్ అసోసియేషన్ పేర్కొంది.

హర్యానా స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్, 2020 చట్టం ఈ ఏడాది జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం స్థూల నెలవారీ వేతనం రూ.30,000కు పైన ఉన్న వాటికే వర్తిస్తుంది. ప్రైవేటు కంపెనీలు, సొసైటీలు, ట్రస్ట్ లు, పార్టనర్ షిప్ సంస్థలకు ఇది అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News