Param Pravega: ‘పరం ప్రవేగ’.. భారత సూపర్ ఫాస్ట్ సూపర్ కంప్యూటర్

Param Pravega Indias Super Fast Super Computer

  • బెంగళూరు ఐఐఎస్ సీలో ఏర్పాటు
  • సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లను అందించిన పూణే సీ–డాక్
  • 3.3 పెటా ఫ్లాప్స్ వేగంతో పని

నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్ సీ)లో సరికొత్త సూపర్ ఫాస్ట్ సూపర్ కంప్యూటర్ ‘పరం ప్రవేగ’ను ఇటీవలే ఏర్పాటు చేశారు.

దేశంలో పరిశోధన శక్తి సామర్థ్యాలను పెంచేందుకుగానూ ఎన్ఎస్ఎం.. దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తోంది. వాటన్నింటినీ అనుసంధానించి అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. ఆ గ్రిడ్ కు నేషనల్ నాలెడ్జ్ నెట్ వర్క్ (ఎన్కేఎన్) బ్యాక్ బోన్ గా ఉండనుంది.

ఇవీ పరం ప్రవేగ ప్రత్యేకతలు

పరంప్రవేగ పేరులో ఉన్నట్టు అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పనిచేసేలా దీని సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ను డిజైన్ చేశారు. ఇంటెల్ జియాన్ కాస్కేడ్ లేక్ ప్రాసెసర్లతో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సీపీయూ) నోడ్ లను రూపొందించారు. జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్) నోడ్ లలో ఎన్ విడియా టెస్లా వీ100 గ్రాఫిక్ కార్డ్స్ ను వాడారు.

ఈ సూపర్ కంప్యూటర్ లో 2 మాస్టర్ నోడ్స్ తో పాటు 11 లాగిన్ నోడ్స్, 2 ఫైర్ వాల్ నోడ్స్, 4 మేనేజ్ మెంట్ నోడ్స్, ఒక ఎన్ఐఎస్ స్లేవ్, 624 సీపీయూ, జీపీయూ నోడ్ లు ఉంటాయి. ఆటోస్ బుల్ సీక్వెనా ఎక్స్ హెచ్ 2000 సిరీస్ సిస్టమ్ హార్డ్ వేర్ వల్ల.. పరం ప్రవేగ 3.3 పెటా ఫ్లాప్స్ స్పీడ్ తో పనిచేస్తుంది.


సెంట్ ఓఎస్ 7.ఎక్స్ ఆధారంగా పనిచేసే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పరం ప్రవేగ పనిచేస్తుంది. జీపీయూ నోడ్స్ వినియోగానికి వీలుగా సీయూడీఏ, ఓపెన్ ఏసీసీ ఎస్డీకేలను ఇన్ స్టాల్ చేశారు. ఇతర గణిత, సైన్స్, అప్లికేషన్ లైబ్రరీల కోసం ఇంటెల్ ఎంకేఎల్, జీఎన్ యూ సైంటిఫిక్ లైబ్రరీ, హెచ్ డీఎఫ్ 5, నెట్ సీడీఎఫ్, పైథాన్ ఆధారిత గణితం, డేటా మార్పు లైబ్రరీలనూ ఇన్ స్టాల్ చేసి పెట్టారు.

ఈ సూపర్ కంప్యూటర్ ను పూణేలోని సీ–డాక్ రూపొందించింది. దానికి సాంకేతిక సాయాన్నీ అందజేస్తుంది. సీ–డాక్ లోని హెచ్ పీసీ టెక్నాలజీస్ టీమ్ ఆటోస్, బుల్ తో పాటు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రూపొందించడంలో కీలకంగా వ్యవహరించింది.

కాగా, బెంగళూరుతో పాటు ప్రస్తుతం ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), మొహాలిలోని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇనిస్టిట్యూట్, పుణేలోని సీడాక్, బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (నాబి)లలో సూపర్ కంప్యూటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఐఐటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీలో దేశంలో తొలి స్వదేశీ సూపర్ కంప్యూటర్ పరమ్ శివాయ్ ను ఇన్ స్టాల్ చేశారు.  

తర్వాత ‘పరం శక్తి’ని ఐఐటీ ఖరగ్ పూర్ ఐఐఎస్ఈఆర్, ‘పరం బ్రహ్మ’ను ఐఐఎస్ఈఆర్ పూణే, ‘పరం యుక్తి’ని బెంగళూరులోని జేఎన్సీఏఎస్ఆర్, ‘పరం సంగానక్’ను బెంగళూరు, కాన్పూర్ ఐఐటీల్లో పెట్టారు. ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ గోవా, ఐఐటీ పాలక్కడ్ లలో హెచ్ పీసీ, ఏఐపై శిక్షణ కోసం ఎన్ఎస్ఎం నోడల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కాగా, 2020లో విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ లలో 'పరం సిద్ధి' చోటు సంపాదించింది. స్పీడ్ లో 62వ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News