Rahul Ramakrishna: ఉత్తినే... జోక్ చేశానంతే!: రిటైర్మెంట్ వ్యాఖ్యలపై నటుడు రాహుల్ రామకృష్ణ వివరణ

Rahul Ramakrishna clarifies his previous tweet
  • సినిమాలకు గుడ్ బై అంటూ ట్వీట్ చేసిన రామకృష్ణ
  • సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
  • ఇలాంటి జీవితం ఎందుకు వదులుకుంటానంటూ మరో ట్వీట్
  • మండిపడుతున్న నెటిజన్లు
  • ట్విట్టర్ లో కామెడీ చేయొద్దని హితవు
ఇకపై సినిమాలు చేయడంలేదు... నటనకు గుడ్ బై చెబుతున్నాను అంటూ టాలీవుడ్ యువ నటుడు రాహుల్ రామకృష్ణ ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానులను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేశాయి. తనదైన టైమింగ్ తో, తెలంగాణ యాసలో కామెడీ డైలాగులు అదరగొట్టే రాహుల్ రామకృష్ణకు ఏమైంది? ఎందుకు సినిమాల నుంచి చిన్నవయసులోనే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు? అంటూ నెట్టింట తీవ్ర చర్చ నడిచింది.

అయితే, దీనిపై రాహుల్ రామకృష్ణ మరోసారి సోషల్ మీడియాలో స్పందించాడు. తాను జోక్ చేశానని వివరణ ఇచ్చాడు. సినిమాల్లో భారీగా పారితోషికం లభిస్తుంటే ఎందుకు తప్పుకుంటాను? అని తిరిగి ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి స్నేహితులు ఫోన్ చేసి సమాచారం అందించారని, దాంతో తాను విస్మయానికి గురయ్యానని రాహుల్ రామకృష్ణ వెల్లడించాడు.

నెటిజన్లు మాత్రం అతడి వివరణ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో చేయాల్సిన కామెడీని ట్విట్టర్ లో చేస్తా ఎలా? అంటూ మండిపడుతున్నారు. ట్వీట్ చేయడం ఎందుకు? అదో జోక్ అనడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.
Rahul Ramakrishna
Tweet
Retirement
Cinema
Tollywood

More Telugu News