Suresh Raina: ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి కన్నుమూత

Suresh Raina father Trilok Chand dies of cancer
  • రైనా కుటుంబంలో విషాదం
  • క్యాన్సర్ తో పోరాడుతూ మరణించిన త్రిలోక్ చంద్ రైనా
  • గతంలో సైన్యంలో పనిచేసిన త్రిలోక్ చంద్
  • బాంబుల తయారీలో దిట్టగా గుర్తింపు
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబంలో విషాదం నెలకొంది. సురేశ్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా అనారోగ్యంతో మృతి చెందారు. త్రిలోక్ చంద్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తమ సొంత నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ గతంలో భారత సైన్యంలో ఆర్డినెన్స్ విభాగంలో పనిచేశారు. ఆయన బాంబులు తయారుచేయడంలో సిద్ధహస్తుడు. కాగా, రైనా తండ్రి మరణించడంతో క్రికెట్ వర్గాలు సంతాపం తెలియజేస్తున్నాయి.
Suresh Raina
Father
Trilok Chand Raina
Demise

More Telugu News