Lata Mangeshkar: ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు... హాజరుకానున్న ప్రధాని మోదీ

PM Narendra Modi will attend Lata Mangeshkar funerals
  • గత నెలలో కరోనా బారినపడిన లతా
  • ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స
  • అందరినీ విషాదంలో ముంచెత్తుతూ కన్నుమూత
  • ఈ సాయంత్రం 6.30 గంటలకు అంత్యక్రియలు
కరోనాబారిన పడి, చికిత్స పొందుతూ కన్నుమూసిన గానకోకిల లతా మంగేష్కర్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. గత కొన్నివారాలుగా ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ అందరినీ విషాదంలో ముంచెత్తుతూ తుది శ్వాస విడిచారు.

కాగా, ముంబయిలోని లతా నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర జరిగింది. భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పలువురు సినీ తారలు, ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్ మైదానంలో ఆ లెజెండరీ సింగర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, లతా మంగేష్కర్ కు అంతిమ నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి చేరుకున్నారు. లతా అంత్యక్రియల్లో మోదీ పాల్గొననున్నారు.
Lata Mangeshkar
Funerals
PM Narendra Modi
Mumbai

More Telugu News