APTF: ఉద్యమం కొనసాగించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయం

AP Teachers Federation decides to continue struggle
  • నిన్న మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు
  • కుదిరిన ఒప్పందం... సమ్మె విరమణ
  • పీఆర్సీ సాధన సమితి నేతలపై ఉపాధ్యాయుల అసంతృప్తి
  • ఆందోళనలు ఆపబోమన్న టీచర్స్ ఫెడరేషన్
మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు ఒప్పందానికి రావడం పట్ల ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నిన్న మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి సభ్యులు ఏం చర్చించారో అర్థం కావడంలేదని టీచర్స్ ఫెడరేషన్ నేతలు వ్యాఖ్యానించారు. ఉద్యమానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రభుత్వ ప్రలోభాలకు స్టీరింగ్ కమిటీ నేతలు లొంగిపోయారని తాము భావిస్తున్నామని అన్నారు.

కొత్త పీఆర్సీపై ఇచ్చిన జీవోలను ప్రభుత్వం రద్దు చేయకుండానే, పీఆర్సీ సాధన సమితి నేతలు ఎలా సంతృప్తి వ్యక్తం చేశారని టీచర్స్ ఫెడరేషన్ నేతలు ప్రశ్నించారు. పైగా, ప్రభుత్వం పీఆర్సీపై అశుతోశ్ మిశ్రా కమిటీ నివేదికను కూడా బహిర్గతం చేయలేదని తెలిపారు.

ఒక్క పిలుపుతో ఛలో విజయవాడ కార్యక్రమానికి లక్షలాదిగా వచ్చారని, ఆ ఉద్యోగుల ఐక్యతను, త్యాగాన్ని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ వృధా చేసిందని విమర్శించారు.  ఇతర ఉద్యోగ సంఘాలను కలుపుకుని తాము మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీచర్స్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు.
APTF
Struggle
Demands
PRC
Andhra Pradesh

More Telugu News