Sputnik Light: సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన కేంద్రం
- స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం
- దేశంలో 9కి పెరిగిన వ్యాక్సిన్లు
- తొలిసారి సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి
- కేంద్రమంత్రి మన్సూఖ్ మాండవీయ ప్రకటన
భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ఇది సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్. భారత్ లో ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న 8 వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లే.
తాజాగా, స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తో దేశంలో కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 9కి పెరిగింది. ఈ కొత్త వ్యాక్సిన్ చేరికతో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత బలోపేతం అవుతుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఓ ప్రకటన చేశారు.