Mandya: కర్ణాటకలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య

5 Killed in karnatakas Mandya district
  • మాండ్యా జిల్లాలో ఘటన
  • హత్య చేసి ఇంట్లోని బంగారం, నగదు దోచుకున్న దుండగులు
  • నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు
కర్ణాటకలో దారుణం జరిగింది. మాండ్య జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో 12 ఏళ్ల లోపున్న నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. శ్రీరంగ పట్టణ తాలూకా కేఆర్ఎస్ గ్రామంలోని బజార్ లైనుకు చెందిన లక్ష్మి (30), రాజ్ (12), కూసమల్ (7), కునాల్ (5), గోవింద్(12) శనివారం రాత్రి నిద్రపోతున్న సమయంలో దుండగులు మారణాయుధాలతో హత్య చేశారు.

అనంతరం ఇంట్లోని బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. హత్యకు గురైన లక్ష్మి భర్త గంగారాం ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తూ పొరుగు ఊర్లకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
Mandya
Police
Murder
Crime News
Karnataka

More Telugu News