Andhra Pradesh: ఉద్యమ స్ఫూర్తిని ఆ నలుగురు నాయకులు సమాధి చేశారు: కేవీ కృష్ణయ్య

JAC leader KV Krishnaiah fired on PRC leaders

  • ఆ నలుగురు ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోతారు
  • మాట నిలుపుకోవడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు దారుణంగా విఫలమయ్యారు
  • ఉద్యోగ సంఘాలను నిలువునా ముంచారు

‘చలో విజయవాడ’ ఉద్యమ స్ఫూర్తిని నలుగురు నాయకులు సమాధి చేశారని ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య ఆరోపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారని అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసి, సగటు ఉద్యోగులు, సోదర ఉద్యోగ సంఘాలను నిలువునా ముంచిన ఆ నలుగురు చరిత్రలో ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు.

అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక పొందకుండా, పీఆర్‌సీ జీవోల రద్దు కానీ, తాత్కాలికంగా వాటిని ఆపడం కానీ చేయకుండా ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని మాటిచ్చిన పీఆర్సీ సాధన సమితి నేతలు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ఆ నలుగురి తీరు ఉద్యోగులు, తోటి ఉద్యోగ సంఘాలను దారుణంగా నిరాశ పరిచిందని కేవీ కృష్ణయ్య అన్నారు.

  • Loading...

More Telugu News