Ram Gopal Varma: మనిషి చావుపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
- RIP అని చెప్పడం చనిపోయిన వారిని అవమానించడమే
- మనిషి చనిపోతే మరింత మంచి ప్రదేశానికి వెళ్లాడని అనుకోవాలి
- మరణం గురించి బాధ పడే బదులు సెలబ్రేట్ చేసుకోవాలి
ఎవరైనా మరణిస్తే... 'RIP' అని మెసేజ్ పెడుతుండటం సాధారణ విషయమే. అయితే దీనిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. RIP అని చెప్పడమంటే చనిపోయిన వారిని అవమానించడమేనని అన్నారు. ఎందుకంటే మన భూమి మీద శాంతియుతంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తులను సోమరిపోతులు అంటారని... అందుకే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు RIP అనే చెప్పే బదులు... 'మంచి జీవితాన్ని గడపండి, మరింత ఎంజాయ్' చేయండి అని చెప్పాలని సూచించారు.
ఎదుటి వ్యక్తి చనిపోవడం పట్ల బాధపడే వ్యక్తులు... ఒక మంచి వ్యక్తి చనిపోయాడని అనుకుంటుంటారని, ఆ ఆలోచన కరెక్ట్ కాదని వర్మ అన్నారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మరింత మంచి ప్రదేశానికి వెళ్లాడని... అందువల్ల బాధపడే బదులు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. మరోవైపు, ఒక చెడు వ్యక్తి చనిపోతే అసలు బాధ పడాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.