Swami Paripurnananda: ఏపీలోని మేధావులందరూ ఒకే వేదికపైకి రావాలి... రాష్ట్రాన్ని కాపాడుకోవాలి: స్వామి పరిపూర్ణానంద

Swami Pripurnananda calls for solidarity to save state

  • శ్రీకాకుళంలో 'స్వాధీనత నుంచి స్వతంత్రత వైపు' సభ 
  • సమాలోచనకు హాజరైన శ్రీపీఠం అధిపతి
  • రాష్ట్రంలో పరాధీనత పెరిగిపోతోందని ఆందోళన
  • సమాలోచన వేదిక అవసరం చాలా ఉందని వెల్లడి

శ్రీకాకుళంలో 'స్వాధీనత నుంచి స్వతంత్రత వైపు' సమాలోచన సభలో శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం నుంచే కాకుండా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఈ సభలో పాల్గొన్నారని, సమయం తక్కువగా ఉన్నప్పటికీ వారంతా తమ అభిప్రాయాలను పంచుకోవడం నిజంగానే సమాలోచన అనిపించిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పరాధీనత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని సంస్కరించాలంటే మేధావులందరూ ఒక వేదికపైకి వచ్చి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొదట పరాధీనత నుంచి రాష్ట్రాన్ని కాపాడి, ఆ తర్వాత స్వాధీనత నుంచి స్వతంత్రత అంశం ఆలోచించాలని వివరించారు.

ప్రతి జిల్లా కేంద్రం, ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి సమాలోచన సమావేశాలు ఏర్పాటు చేయాలని స్వామి పరిపూర్ణానంద సూచించారు. ఎవరికీ భవిష్యత్తు లేకుండా పోయిందని,
రాష్ట్రాన్ని ఈ కాలసర్పం చేతిలో నుంచి బయటపడేయాలంటే ఇలాంటి సమాలోచన అనే వేదిక చాలా అవసరం అని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News