True Caller: ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో 'ట్రూ కాలర్'!

True Caller will be available as a pre loaded app in android phones
  • కొత్త నెంబర్ల గుట్టును పట్టేసే ట్రూ కాలర్!
  • ఇప్పటివరకు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న వైనం
  • ప్రీలోడెడ్ గా వచ్చేందుకు ఆండ్రాయిడ్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం
ట్రూ కాలర్... స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారికి ఈ యాప్ తెలిసే ఉంటుంది. ఏదైనా కొత్త నెంబరు నుంచి కాల్ వస్తే, ఈ యాప్ ద్వారా ఆ నెంబరు ఎవరిదో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో కొత్త ఫోన్లలో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పలు ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ట్రూ కాలర్ వర్గాలు తెలిపాయి.

అయితే, ప్రీలోడెడ్ గా తమ యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాన్ని ఉపయోగించాలా? వద్దా? అనేది యూజర్ నిర్ణయించుకోవచ్చని ట్రూ కాలర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది ఫోన్లలో ప్రీలోడెడ్ యాప్ గా సేవలు అందించాలన్నది తమ ప్రణాళిక అని వివరించింది.
True Caller
Pre Loaded
Android Phones
Caller ID

More Telugu News