BSNL: అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్!

BSNL new offer with 150 days validity
  • రూ. 197కే 150 రోజుల వ్యాలిడిటీ
  • ప్రతి రోజు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ ల ఆఫర్
  • 18 రోజుల తర్వాత టాప్ అప్ వేయించుకోవాల్సి ఉంటుంది
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కొన్ని షరతులతో రూ. 197కే 150 రోజుల వ్యాలిడిటీని అందించే ప్లాన్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతి రోజు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేస్తోంది. అయితే ఇక్కడో షరతు ఉంది. ఈ ప్రయోజనాలకు 18 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నా... ఔట్ గోయింగ్ కాల్స్, ఇంటర్నెట్ కోసం టాప్ అప్ వేయించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులకు సుదీర్ఘ వ్యాలిడిటీ అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. అయితే 18 రోజుల తర్వాత టాప్ అప్ వేయించుకోకపోయినా... ఉచిత ఇన్ కమింగ్ సౌకర్యం మాత్రం ఉంటుంది. ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్ గా ఉంటుంది.
BSNL
Offer
150 Dats Validity

More Telugu News