Vijayasai Reddy: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై రాజ్యసభలో లేవనెత్తిన విజయసాయిరెడ్డి

 Vijaysai Reddy asks Centre to fill up job vacancies

  • కొనసాగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • దేశంలో 8 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న విజయసాయి
  • వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి
  • యువతకు ప్రయోజనం కలిగించాలని వినతి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల అంశాన్ని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు రాజ్యసభలో లేవనెత్తారు. జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అధికారిక గణాంకాల ప్రకారం సుమారు 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో రెండు లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఉన్నాయని, ఒక లక్ష ఉద్యోగాలు సైన్యంలో ఉన్నాయని విజయసాయి వివరించారు. ఈ ఉద్యోగాలను వార్షిక క్యాలెండర్ల ప్రకారం భర్తీ చేస్తే యువతకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా, రాజ్యసభలో నేడు టీమిండియా-19 క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో టీమిండియా కుర్రాళ్లు కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు టీమిండియా అండర్-19 ఆటగాళ్లను, కోచ్, సహాయక సిబ్బందిని అభినందిస్తూ ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News