Jagan: జగన్ కు హైకోర్టు ఉద్యోగుల లేఖ.. పీఆర్సీ సాధన సమితి నేతలపై విమర్శలు!

AP High Court employees writes letter to Jagan

  • పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలమయ్యారు
  • ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించండి
  • అశుతోష్ మిశ్రా రిపోర్టును పక్కన పెట్టారు

ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించినప్పటికీ పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఉపాధ్యాయలు, ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను, ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలమయ్యారని లేఖలో హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించాలని, తమకు జరిగిన అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు. అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ రిపోర్టును పూర్తిగా పక్కన పెట్టారని, కేవలం మంత్రుల ఉపసంఘం నిర్దేశించిన ఫిట్ మెంట్ నే ప్రకటించారని తెలిపారు. పీఆర్సీ సాధన సమితి ఇటీవల జరిగిన చర్చల సమయంలో అశుతోష్ మిశ్రా నివేదిక అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News