Andhra Pradesh: ఏప్రిల్ లో ఏపీ ఇంటర్ పరీక్షలు!

AP Inter exams to be conducted in April
  • ఏప్రిల్ రెండో వారం నుంచి పరీక్షలు
  • మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహణ
  • ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షలను నిర్వహించి తీరుతామని ఏపీ ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం.

ఏప్రిల్ రెండో వారం నుంచి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహకాలు చేస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం మార్చిలోగా ప్రాక్టికల్స్ ను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులందరినీ ఏపీ ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Inter
Exams
Schedule

More Telugu News