Kamal Haasan: అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయి.: హిజాబ్ వివాదంపై కమలహాసన్
- కర్ణాటక పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయి
- అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజన
- ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకూడదు
- మరింత అప్రమత్తంగా ఉండాలి
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ''కర్ణాటకలో చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయి. అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతోన్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలి. తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి'' అని కమలహాసన్ ట్వీట్ చేశారు.
కాగా, కర్ణాటకలోని పలు కాలేజీల్లో ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడం, మరో వర్గం విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించి వస్తుండడం వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలను పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.