Virat Kohli: నేటి వన్డే మ్యాచ్ తో విరాట్ కోహ్లీకి అరుదైన రికార్డు

Virat Kohli set to join in elite list with 100 ODIs at home

  • దేశీయంగా 100 ఓడీల క్లబ్ లో చోటు
  • గతంలో నలుగురికే ఈ రికార్డు
  • సచిన్, అజారుద్దీన్, యువరాజ్, ధోనీ
  • కోహ్లీ మరో సెంచరీ కొడితే సచిన్ సరసన

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. బుధవారం వెస్టిండీస్ -  భారత్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతుండడం తెలిసిందే. స్వదేశంలో కోహ్లీకి ఇది నూరవ (100) వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ (ఓడీఐ) అవుతుంది.

స్వదేశంలో 100 ఓడీలు ఆడిన ఆటగాళ్లు ఇప్పటి వరకు నలుగురే ఉన్నారు. సచిన్ టెండుల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ కే ఈ రికార్డు సాధ్యమైంది. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ కూడా చేరనున్నాడు.

విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఇప్పటి వరకు 258 ఓడీలు ఆడాడు. మొత్తం 12,200 పరుగులు చేశాడు. దేశీయంగా 99 ఓడీలు ఆడగా, 5002 పరుగులు చేశాడు. దేశీయంగా 19 సెంచరీలు బాదాడు. విరాట్ కోహ్లీ కంటే బ్యాటింగ్ లో మెరుగైన రికార్డు గతంలో ఒక్క సచిన్ కే ఉంది. సచిన్ టెండుల్కర్ దేశీయంగా 164 ఓడీలు ఆడి, 6,976 పరుగులు రాబట్టుకున్నాడు. సచిన్ దేశీయంగా 20 శతకాలు సాధించాడు. బుధవారం మ్యాచ్ లో కోహ్లీ 100 పరుగులు సాధిస్తే కనుక సచిన్ తో సమానం అవుతాడు.
ఆటగాడి పేరు
దేశీయంగా ఓడీఐలు
చేసిన పరుగులు
మొత్తం సెంచరీలు
సచిన్ టెండుల్కర్
164
6976
20
ఎంఎస్ ధోనీ
127
4351
7
అజారుద్దీన్
113 3163
3
యువరాజ్ సింగ్
108
3415
7
విరాట్ కోహ్లీ
99
5002
19





  • Loading...

More Telugu News