Off Beat: లేస్ చిప్స్ ప్యాకెట్ల కవర్ తో చీర.. దాన్ని కట్టుకుని మురిసిపోయిన యువతి.. ఇదిగో వీడియో
- ప్యాకెట్ లోపలి భాగం కనిపించేలా చీర
- చీరకు అంచులుగా ప్యాకెట్ బయటి భాగం
- ఓ మై గాడ్ అంటున్న నెటిజన్లు
అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల, కుక్కుపిల్ల.. కాదేదీ కవితకు అనర్హమని అన్నారు మహాకవి శ్రీశ్రీ. కవితల మాటేమోగానీ.. ఇప్పటితరం మాత్రం కొత్త కొత్త పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నారు. అందుకు ఇదిగో ఈ అమ్మాయే ఉదాహరణ.
లేస్ చిప్స్ ప్యాకెట్లతో చీర తయారు చేసుకున్న ఆ యువతి.. దానిని కట్టుకుని తెగ మురిసిపోయింది. ప్యాకెట్ లోపలి భాగం బయటకు కనిపించేలా చీరను తయారు చేసి.. దానికి అంచుగా ప్యాకెట్ బయటి భాగం కనిపించేలా పల్లునూ కుట్టింది.
ఫర్ ద లవ్ ఆఫ్ బ్లూ లేస్ అండ్ శారీ అనే క్యాప్షన్ పెట్టి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వీడియోను వదిలింది. ఇంకేముంది, ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఓ మైగాడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.