Unstoppable Talk Show: చిరంజీవితో ఎపిసోడ్ చేసుంటే బాలయ్య అన్ స్టాపబుల్ షో మరో లెవెల్లో ఉండేది: షో దర్శకుడు బీవీఎస్ రవి

BVS Ravi opines on proposed episode with Chiranjeevi in Balakrishna Unstoppable Talk Show
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
  • ఆహా ఓటీటీలో ప్రసారం
  • ఇటీవలే ముగిసిన సీజన్-1
  • టాక్ షోకి దర్శకత్వం వహించిన బీవీఎస్ రవి
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణను మరో కొత్తకోణంలో చూపించిన కార్యక్రమం అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ టాక్ షోలో హోస్ట్ గా బాలకృష్ణ వ్యవహరించిన విధానం వినూత్నరీతిలో ఉండడంతో అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ఆహా ఓటీటీ యాప్ లో ప్రసారమైన ఈ టాక్ షో రికార్డు నమోదు చేసింది. అత్యధికంగా 40 కోట్ల నిమిషాల వీక్షణ రికార్డు నెలకొల్పింది. మోహన్ బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, నాని, రానా వంటి సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, అన్ స్టాపబుల్ షోకి దర్శకుడుగా వ్యవహరించిన టాలీవుడ్ సినీ రచయిత బీవీఎస్ రవి ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ ఎపిసోడ్ రూపొందించాలని అనుకున్నామని వెల్లడించారు. కానీ ఆ సమయంలో బాలయ్య భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నారని, అటు చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించారని బీవీఎస్ రవి వివరించారు. అందువల్ల చిరంజీవి డేట్లు దొరకడం కష్టమైందని, దాంతో మెగా ఎపిసోడ్ ఆలోచన విరమించుకున్నామని చెప్పారు.

కానీ చిరంజీవితో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చేసుంటే టాక్ షో మరో లెవెల్లో ఉండేదని అభిప్రాయపడ్డారు. రెండో సీజన్ లో అయినా చిరంజీవితో ఎపిసోడ్ ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అన్ స్టాపబుల్ సీజన్-2 ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నదానిపై స్పష్టత లేదన్నారు.
Unstoppable Talk Show
Chiranjeevi
Balakrishna
Episode
BVS Ravi
Aha OTT

More Telugu News