Talasani: ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: మంత్రి తలసాని
- రాష్ట్ర విభజనపై మోదీ వ్యాఖ్యలు
- భగ్గుమంటున్న టీఆర్ఎస్ నేతలు
- నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు
- మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న తలసాని
ఇటీవల బడ్జెట్ ప్రకటన అనంతరం తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం ముదిరింది. కొన్నిరోజుల కిందట ప్రధాని మోదీ ఉమ్మడి రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. గుజరాత్ కంటే తెలంగాణ ఎక్కువ అభివృద్ధి చెందుతుండడం పట్ల ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ప్రధాని క్షమాపణలు చెప్పేవరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.