allu aravind: చిరు వెళ్తున్నారు కాబ‌ట్టి నేను వెళ్లాల్సిన‌ అవ‌స‌రం లేదు: అల్లు అర‌వింద్

chiru is going ap so i dont need to go says aravind
  • నేడు సీఎం జగన్ తో చిత్ర ప్రముఖుల భేటీ   
  • తమ కుటుంబం నుంచి చిరంజీవి వెళుతున్నారన్న అరవింద్  
  • వివాదాల‌కు నేటితో తెర‌ప‌డుతుంద‌ని ఆకాంక్ష‌
టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్‌, మహేశ్ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళి, కొరటాల శివ త‌దిత‌రులు ఏపీకి వెళ్తున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్ర‌యం నుంచి వారు ఏపీకి వెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ విమానాశ్ర‌యానికి చేరుకున్న నిర్మాత అల్లు అర‌వింద్ ను మీడియా చుట్టుముట్టి మాట్లాడింది.

అయితే, తాను వెళ్తున్నది ఏపీకి కాద‌ని, మ‌రో ప‌నిపై చెన్నైకి వెళ్తున్నాన‌ని అల్లు అర‌వింద్ చెప్పారు. 'నేటితో సినిమా టికెట్ల వివాదానికి తెర‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాను. అంద‌రికీ మంచి జ‌రుగుతుంద‌ని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు మా కుటుంబం నుంచి చిరంజీవి గారు వెళ్తున్నారు.. క‌నుక నేను వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు' అని అల్లు అర‌వింద్ చెప్పారు.
allu aravind
Tollywood
Chiranjeevi

More Telugu News