Stock Market: ఆర్బీఐ ప్రకటనతో మార్కెట్​ లో జోష్.. దూసుకెళ్తున్న సూచీలు

Stock Markets Gain After RBI Monetary Policy Announcement

  • ప్రస్తుతం 445 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
  • 58,914 వద్ద ట్రేడింగ్
  • 134.60 పాయింట్ల లాభాలలో నిఫ్టీ
  • 17,598.40 వద్ద ట్రేడింగ్

దేశీయ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడంతో మార్కెట్ వర్గాల్లో జోష్ కనిపించింది. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 445 పాయింట్ల లాభంతో 58,914 వద్ద ట్రేడ్ అవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 134.6 పాయింట్ల లాభంతో 17,598.40 వద్ద ట్రేడ్ అవుతోంది.  

రియాల్టీ, ఫైనాన్స్, మెటల్, పవర్ రంగాల షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అదానీ పవర్, రెడింగ్ టన్, ఒమెక్స్, స్వాన్ ఎనర్జీ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ ఎఫ్ఎంసీజీ అత్యధిక నష్టాల్లో ర్యాలీ చేస్తోంది. వాస్తవానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాల మధ్య సూచీలు ఊగిసలాటతోనే ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ ప్రకటన తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. ఇటు అమెరికా మార్కెట్ లోనూ భారీ ర్యాలీ కొనసాగుతోంది. మెటా, టెస్లా, మైక్రోసాఫ్ట్, ఆల్భాబెట్ వంటి కంపెనీల షేర్లు 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు లాభపడ్డాయి.

  • Loading...

More Telugu News