Ajinkya Rahane: రవిశాస్త్రిపై రహానే తీవ్ర విమర్శలు

Ajinkya Rahane fires on Ravi Shastri

  • గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించిన భారత్
  • తాత్కాలిక కెప్టెన్ గా జట్టుకు ఘన విజయాన్ని కట్టబెట్టిన రహానే
  • ఆ ఘనత తనదే అన్నట్టుగా చెప్పుకున్న రవిశాస్త్రి

గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ కు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన రహానే ఇండియాకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. ఆ సిరీస్ లో అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఇండియా ఆలౌట్ కావడం, ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు కోహ్లీ తిరుగుపయనం కావడం, పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడటం వంటి తరుణంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువ ఆటగాళ్లలో రహానే స్ఫూర్తిని నింపి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతేకాదు మెల్ బోర్న్ టెస్టులో సెంచరీతో సత్తా చాటాడు. అయితే ఆ విజయంతో అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రిని మీడియా ఆకాశానికి ఎత్తేసింది. రవిశాస్త్రి కూడా అంతా తనవల్లే అన్నట్టుగా వ్యవహరించారు.

దీనిపై రహానే స్పందిస్తూ... టీమిండియా ఘన విజయం సాధించడాన్ని తాను కాకుండా, మరొకరు గొప్పగా చెప్పుకున్నారని రవిశాస్త్రిపై మండిపడ్డాడు. ఆస్ట్రేలియాలో తాను ఏం చేశానో అందరికీ తెలుసని... దాని గురించి తాను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. గ్రౌండ్ లో, డ్రెస్సింగ్ రూమ్ లో తాను కీలక నిర్ణయాలు తీసుకున్నానని... అయితే ఆ ఘనతను వేరొకరు తీసుకున్నారని రవిశాస్త్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. సిరీస్ గెలవడమే తనకు ముఖ్యమని అన్నాడు.

  • Loading...

More Telugu News