Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం

Three died in a fatal road accident in Kurnool district
  • ఉలిందకొండ వద్ద ఘటన
  • ఆగివున్న లారీ కిందికి దూసుకెళ్లిన కారు
  • ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగివున్న కంటైనర్ లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి ప్రాణాలు విడిచారు. ఆంజనేయులు, ధరణి, కుమార్ అనే వ్యక్తులు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు.

వీరంతా ధర్మవరంకు చెందినవారు. ఆసుపత్రిలో బంధువులు చికిత్స పొందుతుండగా, వారిని చూసేందుకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ఆగి వున్న కంటైనర్ లారీ కిందికి దూసుకెళ్లింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడడంతో వారి బంధువర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Road Accident
Kurnool District
Ulindakodna
Dharmavaram

More Telugu News