Nagababu: మా శ్రీను అన్న... కాలేజీ రోజుల నుంచి మాకు ఆప్తుడు: వైసీపీ ఎంపీపై నాగబాబు ట్వీట్

Nagababu tweets on meeting with YCP MP Magunta
  • హైదరాబాదులో బొత్స తనయుడి పెళ్లి
  • హాజరైన నాగబాబు
  • వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో భేటీ
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు సందీప్, పూజితల వివాహానికి సినీ నటుడు, జనసేన నేత నాగబాబు కూడా విచ్చేశారు. ఈ పెళ్లికి హాజరైన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో ఆప్యాయంగా ముచ్చటించారు. దీనిపై నాగబాబు ట్విట్టర్ లో వెల్లడించారు.

"మా శ్రీను అన్న... ఇప్పుడు పార్టీలు వేరైనా మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి మాకు చాలా ఆత్మీయుడు. మా కాలేజీ రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లిలో ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్నారు.
Nagababu
Magunta Srinivasulu Reddy
Botsa
Marriage
Hyderabad
Janasena
YSRCP

More Telugu News