Balakrishna: వాళ్లు నన్ను ‘తాత’ అని పిలవకూడదు.. ‘బాలా’ అనే పిలవాలి: బాలకృష్ణ
- సరదా గేమ్ ఆడించిన ఆహా టీమ్
- అభిమానులు అడిగిన ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు
- అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ పూర్తయిన సందర్భంగా గేమ్
వెండితెరపైనే కాదు.. వ్యాఖ్యాతగా మారి బుల్లితెరపైనా తానేంటో చూపించారు నందమూరి బాలకృష్ణ. ఆహా ఓటీటీలో నడుస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో ఫస్ట్ సీజన్ పూర్తయింది. 40 కోట్ల మందికిపైగా వ్యూస్ తో అత్యంత ఎక్కువ మంది చూసిన షోగా అది రికార్డ్ సెట్ చేసింది. ఫస్ట్ సీజన్ పూర్తయిన సందర్భంగా ఆహా టీమ్.. బాలయ్యతో ‘నెవర్ హ్యావ్ ఐ ఎవర్’ అనే గేమ్ ఆడించింది. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
అభిమాని: మీరెప్పుడైనా కాలేజీ మానేశారా?
బాలయ్య: నెవర్.. ఇలాంటివి ఎవరైనా బయటకు చెప్తారా? ఏంటి?
అభిమాని: మీ తండ్రికి కాలేజీ బంక్ కొట్టిన విషయాలు తెలుసా?
బాలయ్య: నెవర్
అభిమాని: మీపై వచ్చిన మీమ్స్ కు ఎప్పుడైనా నవ్వుకున్నారా?
బాలయ్య: చాలా సార్లు. మొన్న కరోనా వచ్చినప్పుడు లెజెండ్ డైలాగ్ మార్చి పెట్టారు.
అభిమాని: డాన్స్ విషయంలో సహ నటులకు ఎప్పుడైనా సలహాలిచ్చారా?
బాలయ్య: ఇస్తుంటాను. మూమెంట్స్ మార్చాలని నేనెప్పుడూ చెప్పను. మాస్టర్ చేసినప్పుడు ఒకట్రెండు సార్లు చూసి వచ్చేసి నా డ్యాన్స్ చేసుకుంటాను.
అభిమాని: మీ మనవళ్లు తాత అని పిలిస్తే ఒప్పుకొంటారా?
బాలయ్య: అస్సలు ఒప్పుకోను. వాళ్లు నన్ను బాలా అనే పిలవాలి. తాత అనిగానీ, గ్రాండ్ పా అని గానీ పిలవకూడదు.