Army: పైలెట్లు లేకుండానే ఎగిరిన ఆర్మీ హెలికాప్టర్.. ఇదిగో వీడియో
- అటానమస్ ‘బ్లాక్ హాక్’ను టెస్ట్ చేసిన అమెరికా
- రెండు సార్లు చేసిన టెస్టుల్లో సక్సెస్
- అరగంటపాటు 4 వేల అడుగుల ఎత్తులో ఎగిరిన వైనం
ఆర్మీ చరిత్రలోనే తొలిసారిగా హెలికాప్టర్ పైలెట్ లేకుండానే పైకి ఎగిరింది. చాలా దూరం ప్రయాణించింది. అమెరికాలోని కెంటకీలో ఆ దేశ ఆర్మీ అధికారులు పైలెట్ లేకుండా వెళ్లగలిగే అటానమస్ ‘బ్లాక్ హాక్’ హెలికాప్టర్ ను టెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 5న దాదాపు అరగంటపాటు పైలెట్ లేకుండానే ఎగిరింది. సిమ్యులేషన్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఊహాజనిత సిటీలోని బిల్డింగులను దాటేస్తూ ముందుకెళ్లింది. ల్యాండింగ్ కూడా పర్ ఫెక్ట్ గా అయింది. గంటకు 190 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో 4 వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. అదే హెలికాప్టర్ తో గత సోమవారం కూడా టెస్ట్ ఫ్లైట్ చేశారు. ‘అలియాస్’ అనే అమెరికా రక్షణ పరిశోధన కార్యక్రమం కింద ఈ కంప్యూటర్ ఆపరేటెడ్ హెలికాప్టర్ ను రూపొందించారు.