Teachers: విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సమావేశం

Teachers union leaders held meeting in Vijayawada
  • ఇటీవల ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ కమిటీ చర్చలు
  • చర్చల తీరుపై ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి
  • పీఆర్సీపై పోరాడాలని నిర్ణయం
తమ డిమాండ్లపై ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమం కొనసాగింపుపై ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. విజయవాడలో ఇవాళ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. పీఆర్సీకి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తమతో కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జేఏసీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇటీవల ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం తెలిసిందే. అయితే ప్రభుత్వ కమిటీ చేసిన ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉపాధ్యాయ సంఘాలు తేల్చి చెప్పాయి.
Teachers
Vijayawada
Meeting
Andhra Pradesh

More Telugu News