Revanth Reddy: కేసీఆర్ కు రోల్ మోడల్ ఊసరవెల్లి: రేవంత్ రెడ్డి సెటైర్

Oosaravelli is role model to KCR says Revanth Reddy
  • ప్రస్తుతం బీజేపీకి పూర్తి వ్యతిరేకిగా మారిపోయిన కేసీఆర్
  • కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్న వైనం
  • ఆశ్చర్యానికి గురవుతున్న కాంగ్రెస్ శ్రేణులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి పూర్తి వ్యతిరేకిగా మారిపోయారు. అంతేకాదు, కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మపై ఆయన మండిపడ్డారు. హిమంత్ ను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు, సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపెట్టాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ లో సడన్ గా వచ్చిన ఈ మార్పుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు. 'ఊసరవెల్లి స్పెషాలిటీ ఏమిటి?' అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఊసరవెల్లి ఫొటోను షేర్ చేశారు. ఈ ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఊసరవెల్లి స్పెషాలిటీ ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా... 'కేసీఆర్ రోల్ మోడల్' అని చెప్పారు. అంతేకాదు 'నెవర్ ట్రస్ట్ కేసీఆర్' అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.
Revanth Reddy
Congress
Manickam Tagore
KCR
TRS

More Telugu News