Balakrishna: 'అఖండ' నిర్మాతతో మరోసారి బాలయ్య!

Balakrishna in Sampthnandi Movie
  • 'అఖండ'తో లభించిన అనూహ్య విజయం
  • మరో ప్రాజెక్టు సెట్ చేస్తున్న మిర్యాల రవీందర్ రెడ్డి
  • సంపత్ నంది కథను బాలయ్య ఓకే చేశాడంటూ టాక్
  • గోపీచంద్ మలినేనితో సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య
బాలకృష్ణ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా 'అఖండ' నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ థియేటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి వ్యవహరించారు.

ఆయనే మరో మాస్ యాక్షన్ మూవీని బాలకృష్ణతో ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక వార్త తాజాగా ఇండస్ట్రీలో షికారు చేస్తోంది. దర్శకుడు సంపత్ నంది దగ్గర మంచి కథ ఉండటంతో, బాలయ్యతో ఆ కథను చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి సంపత్ నందిని పంపించడం జరిగిందని చెప్పుకుంటున్నారు.

'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' వంటి మాస్ యాక్షన్ హిట్లు సంపత్ నంది ఖాతాలో ఉన్నాయి. ఆయన వినిపించిన కథ నచ్చడంతో బాలయ్య ఓకే చెప్పారని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. ఆ తరువాత అనిల్ రావిపూడి లైన్లో ఉన్నాడు.
Balakrishna
Gopichand Malineni
Sampathnandi

More Telugu News