Lalu Prasad: మరో దాణా స్కామ్ కేసులో దోషిగా లాలూ ప్రసాద్ యాదవ్

Lalu Prasad Yadav Convicted In 5th Fodder Scam Cas

  • రాంచిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ
  • హాజరైన లాలూ ప్రసాద్ యాదవ్
  • మూడేళ్లకు మించి శిక్షపడితే మళ్లీ జైలుకే

దాణా స్కామ్ కు సంబంధించి ఐదో కేసులోనూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా ఝార్ఖండ్ లోని రాంచి సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. జడ్జి సీకే షైని ఆదేశాల మేరకు లాలూప్రసాద్ యాదవ్ మంగళవారం స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.

డొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లను అక్రమంగా తీసుకున్న కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు, శిక్షను ప్రకటించాల్సి ఉంది. మూడేళ్లకు మించి శిక్ష పడితే తిరిగి ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుంది. పశువులకు ఉచిత దాణా పేరుతో కార్యక్రమం ప్రారంభించిన నాటి లాలూ సర్కారు ఆ పేరుతో నిధులను బొక్కేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.

2017 డిసెంబర్ నుంచి లాలూ ఎక్కువ కాలం జైలులోనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో చికిత్స కూడా తీసుకున్నారు. గతంలో నాలుగు కేసుల విషయంలో లాలూ దోషిగా నిర్ధారణ అవ్వగా, వీటిపై ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News