Vishwak Sen: 'అశోకవనంలో..' నుంచి ఆకట్టుకునే సాంగ్!

Ashokavanamalo arjuna Kalyanam Song released
  • విష్వక్ సేన్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • పెళ్లి చూపులు ప్రధానంగా సాగే కథ
  • కథానాయికగా రుక్షార్ థిల్లోన్
  • వచ్చేనెల 4వ తేదీన విడుదల  
విష్వక్సేన్ ఇంతవరకూ యూత్ .. మాస్ ఆడియన్స్ మెచ్చే కథలను చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతును పొందడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాను చేశాడు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "ఓరోరి సిన్నవాడా సిన్నవాడా గగ్గోలు పడకోయి పిల్లగాడా, ఓరోరి సిన్నవాడా సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా .. ఆటా పాటా ఆటు పోటు అంతా మాయరా" అంటూ ఈ పాట సాగుతోంది. హీరోను ఉద్దేశించి హీరోయిన్ పాడే పాట ఇది.

 బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. జై క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి సానపాటి భరద్వాజ్ సాహిత్యాన్ని అందించగా, అనన్య భట్ - గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో విష్వక్ సేన్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
Vishwak Sen
Rukshar Dhillon
Ashokavanamlo Arjuna Kalyanam Movie

More Telugu News