Anand Mahindra: అజయ్ దేవగణ్ వచ్చేలోపు ఊరొదిలి పారిపోవాలి: ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్

Ajay Devgn loses his cool during ad shoot a concerned Anand Mahindra says better leave town
  • మహీంద్రా ట్రక్, బస్ యాడ్‌లో అజయ్‌ దేవగణ్
  • చివరి నిమిషంలో స్క్రిప్ట్‌లో మార్పులు
  • ఇంకెన్నిసార్లు మారుస్తారని చిరాకుగా ప్రశ్నించిన నటుడు
మిగతా పారిశ్రామికవేత్తలతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో  ఆనంద్ మహీంద్రా చాలా చురుగ్గా ఉంటారు. స్ఫూర్తిమంతమైన వీడియోలు పోస్టు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన ఏదైనా ట్వీట్ చేశారంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. అందుకనే ఆయన ట్వీట్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు.  తాజాగా, ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ మహీంద్రా గ్రూప్‌కు చెందిన ట్రక్, బస్ యాడ్‌లో నటించేందుకు రెడీగా ఉంటాడు. అయితే, చివరి నిమిషంలో యాడ్ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయడంతో ఆయన విసుగ్గా.. ఇంకెన్నిసార్లు మారుస్తారని ప్రశ్నిస్తాడు. అవతలి నుంచి ఓ గొంతు.. ‘నాలుగుసార్లే మార్చాం సర్’ అని సమాధానం వస్తుంది. దీంతో అజయ్ దేవగణ్ కొంత చిరాకుగా కనిపిస్తాడు.

ఈ వీడియోను మహీంద్రా ట్రక్ అండ్ బస్ సంస్థ ట్వీట్ చేసింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. ‘అజయ్ దేవగణ్ అసహనంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన ఇక్కడకు రాకముందే నేనే ఊరొదిలి వెళ్లిపోవడం మంచిది’ అని క్యాప్షన్ తగిలించారు.
Anand Mahindra
Twitter
Ajay Devgn
Bollywood

More Telugu News