Chiranjeevi: మరోసారి మెగాస్టార్ మూవీలో అనసూయ!

Anasuya in Bhola Shankar Movie
  • వెండితెరపై బిజీ అవుతున్న అనసూయ
  • 'రంగమ్మత్త'గా మంచి మార్కులు  
  • 'పుష్ప' .. 'ఖిలాడి' సినిమాలతో పెరిగిన క్రేజ్
  • 'భోళా శంకర్'లో డిఫరెంట్ రోల్      
ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆరంభంలో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన అనసూయ, ఆ తరువాత ముఖ్యమైన పాత్రలపై దృష్టిపెట్టింది. 'రంగస్థలం' సినిమాలోని రంగమ్మత్త పాత్ర నుంచి, కీలకమైన పాత్రల వైపు మాత్రమే మొగ్గుచూపుతూ వెళుతోంది.

ఇటీవల వచ్చిన 'పుష్ప' సినిమాలో పోషించిన 'దాక్షాయణి' పాత్ర .. 'ఖిలాడి' సినిమాలో చేసిన 'చంద్రకళ' పాత్రలు ఆమెకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన అనసూయ, మరోసారి ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళాశంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా పట్టాలెక్కేసింది. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ కోసం అనసూయను తీసుకున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ అవుతుందని చెబుతున్నారు. ఆ పాత్ర గురించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
Chiranjeevi
Thamannah
Anasuya
Bhola Shankar Movie

More Telugu News