Sriram: ఆ ప్రమాదం వలన అనేక అవకాశాలు పోయాయి: హీరో శ్రీరామ్

Alitho Saradaga Interview

  • కెరియర్ ను మొదలెట్టిన తొలి రోజులు అవి
  • తమిళ సినిమా షూటింగులో అగ్ని ప్రమాదం జరిగింది
  • కోలుకోవడానికి రెండేళ్లు పడుతుందన్నారు
  • డైరెక్టర్ రసూల్ ధైర్యం చెప్పాడన్న శ్రీరామ్

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి స్టార్ హీరోగా ఎదిగినవారిలో అజిత్ తరువాత శ్రీరామ్ కనిపిస్తాడు. హైదరాబాద్ లో ఉంటూ మోడలింగ్ నుంచి ఆయన సినిమాల దిశగా అడుగులు వేశాడు. 'రోజాపూలు' .. 'ఒకరికి ఒకరు' వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ఆయన ఖాతాలో కనిపిస్తాయి. 50కి పైగా సినిమాలు చేసిన ఆయన, తాజాగా 'ఆలీతో సరదాగా'లో మాట్లాడాడు.

"కెరియర్ లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్నాను. తెలుగు .. తమిళ భాషల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అగ్నిప్రమాదం బారిన పడ్డాను. తమిళంలో ఒక సినిమా చేస్తుండగా అనుకోకుండా ఆ ప్రమాదం జరిగింది. చూస్తుండగానే నాకు మంటలు అంటుకున్నాయి. తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది.

ఆ అగ్నిప్రమాదంలో నా కాళ్లు .. చేతులు .. పెదాలు .. జుట్టు చాలావరకూ కాలిపోయాయి. ఇక నా పనైపోయిందని అనుకున్నాను. నేను కోలుకోవడానికి రెండేళ్లు పడుతుందని అన్నారు. కానీ డైరెక్టర్ రసూల్ వలన చాలా త్వరగా కోలుకున్నాను. ఆ సమయంలో తెలుగు .. తమిళ భాషల్లో చేయవలసిన చాలా సినిమాలు చేజారిపోయాయి. వాటిలో 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' .. 'యువ' కూడా ఉన్నాయి" అని చెప్పుకొచ్చాడు.  

  • Loading...

More Telugu News