Samatha Murthy Statue: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుముల ప్రకటన
- ఐదేళ్లలోపు చిన్నారులకు పూర్తిగా ఉచితం
- 6-12 ఏళ్లలోపు వారికి రూ. 75 ప్రవేశ రుసుం
- పెద్దలకు రూ. 150 టికెట్
- ప్రస్తుతానికి నిలిచిపోయిన త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుములను ప్రకటించారు. ఈ కేంద్రంలో కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఈ నెల 19 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాతి రోజు నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లోనూ భక్తులను అనుమతిస్తారు. ప్రస్తుతానికి శ్రీరామనుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహ దర్శనం, త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో, ఫౌంటేన్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు.
బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫ్రేం ఏర్పాటుతోపాటు ఇతర పనులు పూర్తి కావడానికి మరో వారం రోజుల వరకు పట్టే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమతా కేంద్ర సందర్శనకు టికెట్ ధరలను ప్రకటించిన నిర్వాహకులు.. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ. 75, ఆపై రూ. 150 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు.