Prabhas: ప్రభాస్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు!

Prabhas in Maruthi Movie
  • రిలీజ్ కి సిద్ధమైన 'రాధేశ్యామ్'
  • షూటింగు పూర్తిచేసుకున్న 'ఆది పురుష్'
  • ముగింపు దశలో 'సలార్'
  • లైన్లోనే ఉన్న 'స్పిరిట్'
ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నుంచి 'రాధేశ్యామ్' విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, 'ఆది పురుష్' షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఇక 'సలార్' కూడా ముగింపు దశకి చేరుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఆ తరువాత ప్రాజెక్టులుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' .. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాలను ఆయన లైన్లో పెట్టేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మారుతికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ బయటికి వచ్చింది. ఈ వార్తను మారుతి ఖండించకపోవడం విశేషం.

ఈ సినిమాలో ఒక కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆమెతో పాటు మరో ఇద్దరు కథానాయికలకు ఈ కథలో చోటు ఉందట. అందువలన ఆ ఇద్దరినీ కూడా సెట్ చేసే పనిలో మారుతి ఉన్నాడని అంటున్నారు. అంటే ప్రభాస్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడన్నమాట. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Prabhas
Sreeleela
Maruthi Movie

More Telugu News